Wipro Careers : ప్రముఖ ఐటీ సంస్థ విప్రోలో ఉద్యోగమంటే చాలా క్రేజ్. తాజాగా ఈ సంస్థ ఎల్1 టెక్ సపోర్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే..
Wipro L1 Tech Support Engineer in Bengaluru Karnataka India : విప్రో కంపెనీ ఎల్1 టెక్ సపోర్ట్ ఇంజినీర్ (Support Engineer) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూర్ (Bengaluru) లొకేషన్‌లో జాబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే.. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
ఇతర ముఖ్య సమాచారం :
- పోస్టులు: ఎల్1 (L1) టెక్ సపోర్ట్ ఇంజినీర్
- కంపెనీ: విప్రో
- అర్హత: డిగ్రీ అర్హత ఉండాలి.
- నైపుణ్యాలు: ఎంఎస్ ఎక్సెల్ , న్యూట్రల్ వాయిస్ అండ్ యాక్సెంట్, కాల్ మేనేజ్‌మెంట్, మల్టీ టాస్క్, ప్రాసెస్ నాలెడ్జ్, అనలిటికల్ స్కిల్స్ తదితర స్కిల్స్ ఉండాలి.
- జాబ్ లొకేషన్: బెంగళూరు కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Amazon : అమెజాన్‌లో డిజిటల్ కంటెంట్ అసోసియేట్ పోస్టులు
అమెజాన్ కంపెనీ డిజిటల్ కంటెంట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుంది. అలాగే.. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
ఇతర ముఖ్య సమాచారం :
- పోస్టులు: డిజిటల్ కంటెంట్ అసోసియేట్
- కంపెనీ: అమెజాన్
- అర్హత: బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
- నైపుణ్యాలు: ఎంఎస్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్, అడ్వాన్స్‌డ్ ఎక్సెల్, ఆంగ్ల భాషా నైపుణ్యం, డేటా అనాలసిస్ ట్రబుల్‌షూటింగ్ పరిజ్ఞానం తదితర స్కిల్స్ ఉండాలి
- జాబ్ లొకేషన్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.