TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్‌ బేసిస్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం

Tirumala Tirupati Devasthanms : టీటీడీ దేవస్థానంలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఎంఎల్‌సీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆఫ్‌లైన్‌ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

ప్రధానాంశాలు:

  • టీటీడీ దేవస్థానంలో కాంట్రాక్ట్‌ బేసిస్‌ జాబ్స్‌
  • మిడిల్ లెవెల్ కన్సల్టెంట్‌ ఖాళీల భర్తీకి ప్రకటన
  • అక్టోబర్‌ 7 దరఖాస్తులకు చివరితేది

Tirumala Tirupati Devasthanms TTD : తిరుపతిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ (SLSMPC) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Temple)లో రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన మిడిల్ లెవెల్ కన్సల్టెంట్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 7 దరఖాస్తులకు చివరితేది.

ఇతర ముఖ్యమైన సమాచారం :

  • మిడిల్ లెవల్ కన్సల్టెంట్ పోస్టులు: 03
  • అర్హత: ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ లేదా ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ లేదా రెలీజియస్‌ ఆర్గనైజేషన్‌ తదితరాల విభాగంలో 10 నుంచి 15 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఐటీ/ అనలిటికల్‌/ కమ్యూనికేషన్‌ తదితరాల్లో నైపుణ్యం కూడా ఉండాలి.
  • వయోపరిమితి: అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
  • జీత భత్యాలు: నెలకు రూ.2 లక్షలతో జీతంతో పాటు అవసరమైన వసతి, ల్యాప్‌టాప్ సౌకర్యం కల్పిస్తారు.
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  • పని చేసే స్థలం:
     తిరుపతి లేదా తిరుమలలో పనిచేయాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్, పాత అలిపిరి గెస్ట్ హౌస్, తిరుపతి చిరునామాకు పంపించాలి.
  • దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్ చిరునామా: recruitments.slsmpc@gmail.com
  • దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్‌ 7, 2024

నోటిఫికేషన్‌

ttd-mlc29-09-2024

TTD : టీటీడీ ఆధ్వర్యంలోని సంస్థలో ఔట్ సోర్సింగ్ జాబ్స్‌.. ఇంటర్వ్యూల ద్వారా ఎంపికTTD Tirumala Tirupati Devasthanams : తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం (TTD Temple)కి చెందిన తిరుప‌తిలో ఉన్న శ్రీ ప‌ద్మావ‌తి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంట‌ర్‌ (Sri Padmavati Children Heart Centre) నందు పలు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ ఉద్యోగాల‌ను ఔట్ సోర్సింగ్ విధానంలో భ‌ర్తీ చేసేందుకు శ్రీ ల‌క్ష్మీ శ్రీ‌నివాస మ్యాన్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (SLSMPC) రిక్రూట్‌మెంట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అయితే.. ఈ ఉద్యోగుల‌కు హిందు మతం వారు మాత్ర‌మే అర్హులని నోటిఫికేష‌న్‌లో స్పష్టంగా పేర్కొంది. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 1వ తేదీన నిర్వహించనున్న ఇంటర్వ్యూకి అన్ని ర‌కాల ఒరిజిన‌ల్ స‌ర్టిఫికేట్స్ (విద్యార్హ‌త, అనుభ‌వం, వ‌య‌స్సు, ఆధార్‌, కుల ధ్రువీక‌రిణ ప‌త్రాలు)తో పాటు ఒక అటెస్ట‌డ్ చేసిన సెట్ జిరాక్స్ కాపీల‌తో హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *