హైదరాబాద్‌ ECIL సంస్థ 187 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. Diploma, BTech అర్హత

ECIL Hyderabad : హైదరాబాద్‌లో ఈసీఐఎల్‌ సంస్థ భారీ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 187 ఖాళీలను భర్తీ చేయనుంది. వివరాల్లోకెళ్తే..

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ రిక్రూట్‌మెంట్‌ 2024
  • 187 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల
  • డిసెంబర్‌ 1వ తేదీ దరఖాస్తులకు చివరితేది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

Hyderabad ECIL Recruitment 2024 : హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ– ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL).. భారీ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏడాది అప్రెంటిస్‌షిప్‌ (apprenticeship) శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 187 గ్రాడ్యుయేట్/ డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ఈఈఈ, ఈఐఈ బ్రాంచ్‌లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అప్రెంటిస్‌ ఖాళీలకు అప్లయ్‌ చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నవంబర్‌ 20వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ఇదే. అలాగే.. అప్లయ్‌ చేసుకోవడానికి అప్లికేషన్‌ లింక్‌ ఇదే.

మొత్తం ఖాళీల సంఖ్య: 187.

  • గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ ఖాళీలు : 150
  • డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు: 37

ఇతర ముఖ్యమైన సమాచారం :

  • ఇంజినీరింగ్ బ్రాంచ్: ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ఈఈఈ, ఈఐఈ బ్రాంచ్‌ల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
  • అర్హత: అప్లయ్‌ చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయోపరిమితి: 31.12.2024 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు.
  • స్టైపెండ్: నెలకు జీఈఏలకు రూ.9000, టీఏ అభ్యర్థులకు రూ.8000 ఉపకారవేతనం ఉంటుంది.
  • శిక్షణ కాలం: ఒక సంవత్సరం ఉంటుంది.
  • ఎంపిక విధానం: డిప్లొమా, బీఈ, బీటెక్‌ పరీక్షల్లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్థలం: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్‌ డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్‌ రోడ్, ఈసీఐఎల్‌, హైదరాబాద్.
  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్‌

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: నవంబర్‌ 20, 2024
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్‌ 1, 2024.
  • ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: డిసెంబర్‌ 4, 2024
  • ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: డిసెంబర్‌ 9, 10, 11 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
  • ప్రవేశాలకి గడువు తేదీ: డిసెంబర్‌ 31, 2024
  • అప్రెంటిస్‌షిప్ శిక్షణ ప్రారంభం: జనవరి 1, 2025

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *