AP TRANSCO Corporate Lawyer Posts : ఏపీ ట్రాన్స్‌కో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. వివరాల్లోకెళ్తే..
ప్రధానాంశాలు:
- ఏపీ ట్రాన్స్‌కో రిక్రూట్‌మెంట్ 2024
- కార్పొరేట్ లాయర్ పోస్టుల భర్తీకి ప్రకటన
- కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
AP TRANSCO Corporate Lawyer Posts : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్‌కో (AP TRANSCO) ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు విజయవాడలోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రాన్‌కో, ఏపీపీసీసీలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఈ ఆఫ్‌లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 10 చివరి తేదీగా నిర్ణయించింది. ఈ ప్రకటన కింద మొత్తం 5 కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ట్రాన్‌కో పోస్టులు ఒకటి, ఏపీపీసీసీలో కార్పొరేట్ లాయర్ పోస్టులు నాలుగు ఉన్నాయి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://aptransco.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.