SSC CGL Result 2024 : డిగ్రీ అర్హతతో 17,727 గ్రూప్-బీ, సీ ఉద్యోగాలు.. త్వరలో ఫలితాలు విడుదల

SSC CGL Result 2024 Tier 1 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్‌ లెవల్ (CGL) పరీక్ష-2024కు సంబంధించిన ఫలితాలను విడుదల చేయడానికి సమాయత్తమవుతోంది. వివరాల్లోకెళ్తే..

ప్రధానాంశాలు:

  • ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1 పరీక్షలు 2024
  • సెప్టెంబర్ 9 నుంచి 26 వరకు పరీక్షల నిర్వహణ
  • ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్న కమిషన్‌
  • 2025 జనవరి 18, 19, 20 తేదీల్లో టైర్‌ 2 పరీక్షలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

SSC CGL Tier 1 Result 2024 : ఎస్ఎస్‌సీ సీజీఎల్ టైర్ 1 ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు వెలువడిన అనంతరం ఎస్‌ఎస్‌సీ (Staff Selection Commission) అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.gov.in/ ద్వారా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రోల్ నంబర్లను ఉపయోగించి ఫలితాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితాల విడుదల సమయంలో టైర్-2 పరీక్షకు షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థుల రోల్ నంబర్లను ఎస్‌ఎస్‌సీ కమిషన్ పీడీఎఫ్ రూపంలో వెల్లడిస్తుంది.

దేశవ్యాప్తంగా 2024 సెప్టెంబర్ 9 నుంచి 26 వరకు SSC CGL Tier 1 పరీక్ష జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రిహెన్షన్పై మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. అదనంగా.. ప్రతి విభాగంలో 25 ప్రశ్నలు, గరిష్ట మార్కులు 50గా నిర్ణయించారు. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగాన్ని మినహాయించి ఇంగ్లిష్, హిందీలో మొత్తం ప్రశ్నలు సెట్ చేశారు. ఇక.. ఎస్ఎస్‌సీ సీజీఎల్ టైర్-1 ప్రొవిజనల్ ఆన్సర్ కీని అక్టోబర్ 4న విడుదల చేయగా.. అభ్యర్థులు అభ్యంతరాలను తెలిపే విండో అక్టోబర్ 8వ తేదీ వరకు అందుబాటులో ఉంచారు.

అలాగే.. జనరల్/అన్రిజర్డ్వ్‌ అభ్యర్థులకు 30 శాతం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 20 శాతం, ఇతరులకు 20 శాతం ఉత్తీర్ణత మార్కులుగా ఉంటాయి. ఇదిలా ఉండగా.. ఎస్ఎస్‌సీ సీజీఎల్ టైర్ 2 పరీక్ష తేదీలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ ఇప్పటికే విడుదల చేసింది. 2025 జనవరి 18, 19, 20 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా మొత్తం 17,727 గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎస్‌సీ లక్ష్యంగా పెట్టుకుంది. టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

SSC CGL 2024 మొత్తం పోస్టులు : 17,727

  • అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌
  • ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్ ఇన్‌కమ్‌ ట్యాక్స్
  • ఇన్‌స్పెక్టర్‌
  • అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్
  • ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌
  • రిసెర్చ్‌ అసిస్టెంట్‌
  • జూనియర్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్‌
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్/ జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్
  • ఆడిటర్
  • అకౌంటెంట్‌
  • అకౌంటెంట్‌/ జూనియర్‌ అకౌంటెంట్
  • పోస్టల్ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌
  • సీనియర్‌ సెక్రెటేరియంట్‌ అసిస్టెంట్‌/ అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌
  • సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌
  • టాక్స్‌ అసిస్టెంట్‌

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *