సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీ.
వివిధ విభాగాలలో 179 పోస్టులకు నోటిఫికేషన్
జనవరి 12 లోగా దరఖాస్తు చేసుకోండి.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ వేర్ హౌసింగ్
కార్పొరేషన్ (సీడబ్ల్యూహెచ్ సీ) లో ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్ విడుదలైంది.
మేనేజ్ మెంట్ ట్రైనీ,
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి
సీడబ్ల్యూహెచ్ సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం 179 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఈ
సందర్భంగా పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్
విధానంలో జనవరి 12 లోగా దరఖాస్తు
చేసుకోవాలని సూచించింది.
పోస్టులు: మేనేజ్ మెంట్ ట్రెయినీ, జూనియర్ టెక్నికల్
అసిస్టెంట్
ఖాళీల సంఖ్య: 179
అర్హతలు: పోస్టును బట్టి డిగ్రీ, బీకాం, సీఏ, పీజీ,
ఎంబీఏ
వయసు: గరిష్ఠంగా 30 ఏళ్లకు మించకూడదు
ఎంపిక చేసేదిలా..: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1350… ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.500
జీతం: నెలకు రూ.29,000 నుంచి రూ.1,80,000 వరకు
https://cewacor.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.