KVS Recruitment 2024
కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాలు (KVS) మరియు నవోదయ విద్యాలయాల్లో (NVS) 6,700కి పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవల కేంద్ర కేబినెట్ దేశవ్యాప్తంగా 28 కొత్త నవోదయ విద్యాలయాలు మరియు 85 కేంద్రీయ విద్యాలయాలను స్థాపించడానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌కు 8 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణకు 7 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయడం జరిగింది.

Vacancy Details
- నవోదయ విద్యాలయాలు (NVS): 1,316 పోస్టులు
- కేంద్రీయ విద్యాలయాలు (KVS): 5,388 పోస్టులు
Eligibility Criteria
- అర్హతలు: పదవ తరగతి, ఇంటర్మీడియట్, లేదా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
- ఉద్యోగాలు: టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
- వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Application Process
ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.in ద్వారా అప్లై చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు సొంత రాష్ట్రాల్లో పనిచేసే అవకాశం పొందవచ్చు.