TG Pharmacist Recruitment : తెలంగాణలో 732 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు – హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG Pharmacist Grade II Recruitment : వైద్యారోగ్య శాఖలో732 ఫార్మాసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నవంబర్ 30వ తేదీన ఈ పరీక్ష జరగనుంది. https://mhsrb.telangana.gov.in/MHSRB/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి.

ఫార్మాసిస్ట్ ఉద్యోగ ఖాళీలు – హాల్ టికెట్లు విడుదలతెలంగాణ వైద్యారోగ్యాశాఖ పరిధిలోని ఫార్మాసిస్ట్ గ్రేడ్‌ 2 రాత పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 30వ తేదీన ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారు.. https://mhsrb.telangana.gov.in/MHSRB/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

వైద్యారోగ్య మొదట ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం… 633 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొంది. ఆ తర్వాత మరో 99 ఫార్మాసిస్ట్ పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో మొదట ఇచ్చిన నోటిఫికేషన్ లోనే వీటిని చేరుస్తూ… ప్రకటన విడుదల చేసింది. ఫలితంగా ఈ సంఖ్య 732కి చేరింది. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ పద్దతిలో పనిజేసే వారికి వెయిటేజ్‌ కల్పిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫార్మసీ పూర్తి చేయటంతో పాటు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో నమోదు చేసుకొని ఉండాలి. అభ్యర్ధులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లకు మించి ఉండకూడదు.

హాల్ టికెట్లు ఇలా దరఖాస్తు చేసుకోండి:

  1. అభ్యర్థులు ముందుగా https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే Click here to download Pharmacist Grade-II hall tickets లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  4. డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  6. రిక్రూట్ మెంట్ ప్రక్రియలో హాల్ టికెట్ చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.

మరోవైపు తెలంగాణ వైద్యారోగ్యశాఖ నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌ నర్సు) పోస్టుల భర్తీ ప్రక్రియ నడుస్తోంది. ఇటీవలనే రాత పరీక్షను నిర్వహించారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ కీ అందుబాటులోకి వచ్చింది. మాస్టర్‌ ప్రశ్నపత్రాలు, రెస్పాన్స్‌ షీట్లను కూడా https://mhsrb.telangana.gov.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే తుది ఫలితాలను ప్రకటించనున్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *