Singareni Recruitment 2024 : సింగరేణిలో 64 ఇంటర్నల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన – దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

SCCL Recruitment 2024 : సింగ‌రేణిలో ఇంట‌ర్న‌ల్ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. 64 జూనియ‌ర్ స‌ర్వే ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన వారు డిసెంబర్ 7వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

సింగరేణిలో ఉద్యోగాలు

సింగ‌రేణిలో ఇంట‌ర్న‌ల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. 64 జూనియ‌ర్ స‌ర్వే ఆఫీస‌ర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 28వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు… డిసెంబర్ 07వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత హార్డ్ కాపీని డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం 5లోపు సమర్పించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. హార్డ్ కాపీలను ‘జనరల్ మేనేజర్ వెల్ఫేర్ ఆర్సీ కొత్తగూడెం యూనిట్ లో ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకునే వారికి ఎలాంటి వయోపరిమితి లేదు. హార్డ్ కాపీలను సమర్పించకపోతే దరఖాస్తును పరిగణనలోకి తీసుకోరు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మైన్స్ సర్వేయర్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. అంతేకాకుండా.. మూడేళ్లపాటు మైన్స్ సర్వేయర్ గా పని చేసిన అనుభవం కూడా ఉండాలి.

ఎంపికైన వారి రూ. 40 వేల నుంచి రూ. 1,40,000 జీతం చెల్లిస్తారు. రిక్రూట్ మెంట్ లో 59 ఉద్యోగాలను లోకల్ కేటగిరి, మిగిలిన 5 పోస్టులను ఆన్ రిజర్వ్ డ్ విభాగంలో భర్తీ చేస్తారు. https://scclmines.com/olappint552024/ లింక్ పై క్లిక్ చేసి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను కింద ఇచ్చిన PDFలో చూడొచ్చు…

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *