Sophie Rain: వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా 20 ఏళ్ల యువతి ఏడాదికి రూ.367 కోట్లు సంపాదించింది. గత సంవత్సరం కాలంలో తను సంపాదించిన ఆదాయం వివరాలు వెల్లడించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
Sophie Rain: ప్రస్తుతం చాలా మంది యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వారిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో మంచి ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నారు. అదేవిధంగా అమెరికాకు చెందిన సోఫీ రెయిన్ గత ఏడాది కాలంలోనే రూ.367 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంటే రోజుకు కోటి రూపాయలకు పైగా సంపాదించింది. మరి, ఎంత డబ్బు ఎలాగో సంపాదించిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం?

చిన్న ఉద్యోగం: అమెరికాకు చెందిన సోఫీ రెయిన్ అనే 20 ఏళ్ల యువతి సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగింది. ఆమెకి ఒక సోదరి, ఇద్దరు సోదరులు ఉన్నారు. తండ్రి సంపాదించే డబ్బులు కుటుంబం పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదు. అయినా కష్టపడి చదువుకుంది. కానీ, ఆర్థిక ఇబ్బందులు మరి ఎక్కువ అవ్వడంతో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది సోఫీ. 17 ఏళ్ల వయసులోనే రెస్టారెంట్‌లో ఓ చిన్న ఉద్యోగంలో చేరింది. అయితే ఆ డబ్బులు కూడా తన కష్టాలను గట్టెక్కించలేకపోయాయి. దాంతో కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంది.