నిరుద్యోగులకు ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగ మేళా జరుగుతుంది. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు
రాష్ట్రంలో యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా ఏమిగనూరు పట్టణంలోని ఎస్ఎంఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మహబూబ్ బాషా, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ తెలిపారు.