రాతపరీక్ష లేకుండా.. రైల్వేలో 5,647 ఖాళీల భర్తీకి RRC నోటిఫికేషన్‌ విడుదల

RRC NFR Recruitment Notification 2024 : రైల్వేశాఖలో ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆర్‌ఆర్‌సీ నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్ రైల్వే మరో అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్‌ విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే..

RRC NFR Apprentice Recruitment 2024 : ఇండియన్‌ రైల్వే (Indian Railway).. నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్ రైల్వే ఎన్‌ఎఫ్‌ఆర్‌ పరిధిలోని డివిజన్‌, వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ గువాహటిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 5,647 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, ఎస్‌అండ్‌టీ, పర్సనల్, అకౌంట్స్, మెడికల్ విభాగాల్లో ఈ అప్రెంటిస్‌ ఖాళీలు ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 3వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కతిహార్ అండ్‌ తింధారియా, అలీపుర్‌దువార్, రంగియా, లుమ్‌డింగ్, టిన్‌సుకియా, న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ అండ్‌ ఇంజినీరింగ్ వర్క్‌షాప్, దిబ్రూగర్, ఎన్‌ఎఫ్‌ఆర్‌ హెడ్‌ క్వార్టర్‌/ మాలిగావ్ డివిజన్‌లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్‌ లేదా అధికారిక వెబ్‌సైట్‌ https://nfr.indianrailways.gov.in/ చూడొచ్చు.

మొత్తం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు 5,647

  • తిహార్ అండ్‌ తింధారియాలో ఖాళీలు: 812
  • అలీపుర్‌దువార్‌లో ఖాళీలు: 413
  • రంగియాలో ఖాళీలు: 435
  • లుమ్‌డింగ్లో ఖాళీలు: 950
  • టిన్‌సుకియాలో ఖాళీలు: 580
  • న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ అండ్‌ ఇంజినీరింగ్ వర్క్‌షాప్‌లో ఖాళీలు: 982
  • దిబ్రూగర్‌లో ఖాళీలు: 814
  • ఎన్‌ఎఫ్‌ఆర్‌లో ఖాళీలు: 661

ఇతర ముఖ్యసమాచారం :

  • విద్యార్హతల విషయానికొస్తే.. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ, 12వ తరగతి, ఎంఎల్‌టీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్ 3, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్‌

rrc-appre-nfr

ఇక.. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. మెట్రిక్యులేషన్‌, ఐటీఐలో వచ్చిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 3వ తేదీతో ముగుస్తుంది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *