AP DSC Syllabus 2024 : ఏపీ డీఎస్సీ 2024 సిలబస్‌ విడుదల.. PDF డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

AP DSC 2024 Syllabus : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈక్రమంలో తొలుత సిలబస్‌ విడుదల చేసింది.

ప్రధానాంశాలు:

  • ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌
  • డీఎస్సీ సిలబస్‌ విడుదలకు ఏర్పాట్లు
  • నోటిఫికేషన్‌ విడుదల కొంత ఆలస్యం!

సిలబస్‌ పీడీఎఫ్‌

MEGA_DSC_2024_Suggestive_Syllabus-27-11-2024

నోటిఫికేషన్‌ మరికొంత ఆలస్యం!

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ విడుదల కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలకావల్సిన ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై అధికారికంగా స్పష్టత లేదు. ఎస్సీ వర్గీకరణపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ (AP DSC Notification 2024) విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ 2, 3 నెలలపాటు వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందించినట్లు అర్థమవుతోంది.

ఈ క్రమంలో ఏపీ డీఎస్సీ 2024 నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థుల సన్నద్ధత కోసం ముందుగా సిలబస్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్‌ 27న డీఎస్సీ సిలబస్‌కు సంబంధించిన ప్రటకన విడుదల చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ కంటే ముందుగా సిలబస్‌ను విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh)కు ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్‌ సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

త్వరలో విడుదల చేయనున్న ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (SGT) 6,371, స్కూల్‌ అసిస్టెంట్లు (SA)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (TGT)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (PGT)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (PET)-132 పోస్టులు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలను, ముఖ్యమైన తేదీలను నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఇప్పటికే టెట్‌ పరీక్షను నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *